సన్ రైజ్ : ఇస్రో ఆదిత్య L1 ప్రయోగం సెప్టెంబర్ 2, ఉదయం 11.50 నిమిషాలకు..

సన్ రైజ్ : ఇస్రో ఆదిత్య L1 ప్రయోగం సెప్టెంబర్ 2, ఉదయం 11.50 నిమిషాలకు..

చందమామను పట్టేశాం.. ఇప్పుడు సూర్యుడు వంతు. ఆదిత్య ఎల్ 1 పేరుతో ఇస్రో ప్రయోగించబోయే శాటిలైట్ ప్రయోగం తేదీ, సమయం ఫిక్స్ అయ్యాయి. ఈ మేరకు ఆగస్ట్ 29వ తేదీ ఇస్రో ప్రకటించింది. 2023, సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు.. ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట నుంచి ప్రయోగం ఉంటుందని వెల్లడించింది ఇస్రో. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు శాస్త్రవేత్తలు.